HomeMovie NewsGame Changer Update 'గేమ్ ఛేంజర్' సక్సెస్ పై నమ్మకం అవే

Game Changer Update ‘గేమ్ ఛేంజర్’ సక్సెస్ పై నమ్మకం అవే

- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో దీనిని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న గేమ్ ఛేంజర్ ని ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇటీవల కమల్ తో తీసిన భారతీయుడు 2 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన శంకర్ ఆ మూవీతో డిజాస్టర్ చవిచూశారు, దానితో రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా గేమ్ ఛేంజర్ పై ఒకింత భయం నెలకొంది. అయితే ఈ మూవీ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.

See also  Game Changer Leaks: వరుస లీక్స్ తో సతమతమవుతున్న 'గేమ్ ఛేంజర్' టీమ్

ముఖ్యంగా యువ దర్శకుడు కథకుడు అయిన కార్తీక్ సుబ్బరాజ్ దీనికి కథని అందించడంతో పాటు పొలిటికల్ యాక్షన్ అలానే భారీ మాస్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఇందులో ఉండడమే అంటున్నారు. ఆ సీన్స్ చరణ్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటాయట. మొత్తంగా తమ టీమ్ మొత్తం ఎంతో కష్టపడుతున్న గేమ్ ఛేంజర్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

See also  Kanguva Producer: తెలుగు సినిమా ఆడియన్స్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన'కంగువ' ప్రొడ్యూసర్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories